హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.12,500 జీతంతో టీచర్ ఉద్యోగాలు

ATP: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 179 ఎస్జీటీ, 222 స్కూల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అత్యధికంగా రాయదుర్గంలో 89 మందిని నియమించనున్నారు. బీఈడీ, ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన వారు ఈనెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలి. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేల వేతనం చెల్లించనున్నారు.