SKLM: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అన్నపూర్ణ ఆశ్రమం వీధిలో భారీ శ్వేతనాగు కలకలం రేపింది. శివజ్యోతి ఇంటి సమీపంలో మంగళవారం పాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ ఓంకార్ త్యాడి చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం సురక్షితంగా అడవిలో విడిచిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పలాసలో శ్వేత నాగు కలకలం


