హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్‌ పై అవగాహన

BPT: చీరాల భాష్యం స్కూల్‌లో విద్యార్థినులకు ‘శక్తి యాప్’, సెల్ఫ్ డిఫెన్స్ నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ మోయిన్, సీఐ సోమశేఖర్ సూచనలతో వన్ టౌన్ ఎస్సై శ్రీనివాసరావు, శక్తి టీం కానిస్టేబుల్ సుబ్బారావు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. అత్యవసర సమయాల్లో శక్తి యాప్‌లోని SOS సదుపాయం, 112 నంబర్ వినియోగం గురించి అవగాహన కల్పించారు.