E.G: బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా పురందేశ్వరీ, రామ్ మాధవ్ నియామకంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో కష్టపడి అత్యున్నత స్థాయికి ఎదిగిన వారికి అభినందనలు తెలిపారు. వారి నియామకం పార్టీకి మరింత బలం చేకూరుస్తుందని, దేశ ప్రగతికి కృషి చేయాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్యాల సాధనకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుల నియామకంపై మంత్రి హర్షం


