హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దళితపేటలో రోడ్డే డ్రైనేజీ

ELR: ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు దళితపేటలో డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. వర్షం పడినా, ఇంట్లో నీళ్లు వదిలినా వెళ్లడానికి డ్రైనేజీ లేకపోవడంతో మురికి నీరంతా ప్రధాన రహదారిపై వచ్చి నిలుస్తుంది. దీంతో దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయి.