హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు

GNTR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీల రాజకీయ సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పలు కీలక బిల్లులపైనా కేబినెట్‌లో చర్చించినట్లు ఆమె వెల్లడించారు.