హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'20వ డివిజన్ అభివృద్ధికి 7.80 కోట్లు'

నెల్లూరు రూరల్ 20వ డివిజన్ గంగోత్రి నగర్‌లోని శ్మశాన వాటిక సమస్యను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మంగళవారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 20వ డివిజన్ అభివృద్ధికి రూ.7.80 కోట్లు కేటాయించామని తెలిపారు.