ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2026లో దురదృష్టకర ఘటన జరిగింది. న్యూఢిల్లీ టైగర్స్ బ్యాటర్ లక్ష్య తరేజా కొట్టిన పవర్‌ఫుల్ స్ట్రైట్ డ్రైవ్ ప్రధాన అంపైర్ ధర్మేష్ భరద్వాజ్ చెవి భాగంలో బలంగా తగిలింది. తీవ్రంగా గాయపడిన ఆయనను ఫిజియోలు వెంటనే మైదానం నుంచి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీ20ల్లో అంపైర్లకు హెల్మెట్లు తప్పనిసరి చేయాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
క్రీడలు
అంపైర్ గూబ పగలగొట్టిన బ్యాటర్!


