హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం తాగి ఆటో నడిపిన డ్రైవర్‌కు రూ.10 వేల జరిమానా

SS: జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మంగళవారం పెనుకొండ కియా పోలీసులు తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి ఆటో నడుపుతూ పట్టుబడిన డ్రైవర్‌కు పెనుకొండ ద్వితీయ శ్రేణి మేజిస్ట్రేట్ కోర్టు రూ.10,000 జరిమానా విధించినట్లు కియా ఎస్సై రాఘవయ్య తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించారు.