హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పార్వతీపురం మండలం ఎం.ఆర్. నగరం ఎంపీటీసీ సభ్యుడు బడే రామారావు తండ్రి బడే బలరాం నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త అలజంగి జోగారావు మంగళవారం రామారావు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బలరాం నాయుడు మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.