హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట స్థావరంపై పోలీసుల దాడి!  

BPT: జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు పేకాట స్థావరాలపై విస్తృత దాడులు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో గుట్టుగా ఆడుతున్న పేకాట రాయుళ్ల స్థావరంపై దాడులు నిర్వహించి జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సెల్‌ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.