హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అభివృద్ధి సంక్షేమానికి ప్రాధాన్యత'

AKP: కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు అభివృద్ధి కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. మునగపాక మండలం చూచుకొండలో మంగళవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.