హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం

AKP: రావికమతం మండలం గుడివాడ గ్రామంలో ఆగస్టు 21న ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాలు, యజ్ఞయాగాదులు, స్వామివారి ప్రాణప్రతిష్ఠ, భజనలు, సంకీర్తనలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కమిటీ కోరింది.