ELR: నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కంప్యూటర్ హార్డ్వేర్ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు డీఎల్డీసీ సహాయ సంచాలకులు కృష్ణవేణి ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగాా 3 నెలల ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్, అంతకంటే పై చదువులు పూర్తి చేసి, 15-35 ఏళ్ల వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కంప్యూటర్ హార్డ్‌వేర్‌పై ఉచిత శిక్షణ


