హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలుష్యాన్ని అరికట్టాలని నిరసన

AKP: బొగ్గు లారీలను నియంత్రించి కాలుష్యాన్ని అరికట్టాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం పరవాడ సినిమా హాల్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బొగ్గు లారీల వల్ల కాలుష్యం వ్యాప్తి చెంది ప్రజలు అనారోగ్యం పాలై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.