VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి,పెండింగ్ పనులు, ప్రజల సమస్యలు, తదితర అంశాలను చర్చించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు, అవసరమైన ప్రభుత్వ సేవలు అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఎంపీ కోరారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో ఎంపీ భేటీ


