కృష్ణా: మాతృభాష తెలుగును పరిరక్షించేందుకు విద్యావ్యవస్థలో మార్పులు అవసరమని గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. పదో తరగతిలో తెలుగులో 37,679 మంది ఫెయిల్ కావడం ఆందోళనకరమన్నారు. తెలుగు బోధన, పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని, విద్యావేత్తలు, ఉపాధ్యాయులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తెలుగు పరిరక్షణకు విద్యావ్యవస్థలో మార్పులు: ఎమ్మెల్యే


