హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ అగ్నిప్రమాదం.. మూడు కార్లు దగ్ధం

PLD: నరసరావుపేటలోని NSB కార్ గ్యారేజీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కారుకు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వేగంగా వ్యాపించినట్లు రూరల్ సీఐ సుబ్బారావు తెలిపారు. ఈ ఘటనలో ఒక ఫార్చునర్, రెండు ఇన్నోవా కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.