హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

VSP: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి అమరరాజా బ్యాటరీ కంపెనీలో శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఆనందపురం మండల స్వర్ణ గ్రామ డిప్యూటీ ఎంపీడీవో  శ్రీరామమూర్తి మంగళవారం వెల్లడించారు. ఎంపికైన వారికి తిరుపతిలో మూడు నెలల పాటు రెసిడెన్షియల్‌ శిక్షణ ఇస్తారు. ఆసక్తి, అర్హత కలిగిన యువతీ, యువకులు తమ గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.