హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసుల దాష్టికం.. వ్యక్తి మృతి

PPM: సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల దాడిలో బందరు మణికంఠ అనే యువకుడు మృతి చెందాడు. బంగారు చోరీ కేసులో అనుమానితుడిగా మణికంఠను పోలీసులు కొట్టారని, ఈ దెబ్బల కారణంగా తీవ్ర గాయాలై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను మరణించాడని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల కస్టడీలో జరిగిన హింస వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగారు.