GNTR: స్టైఫండ్‌ను 15 శాతం పెంచాలని కోరుతూ మంగళవారం గుంటూరు జీజీహెచ్ జూనియర్ డాక్టర్లు ర్యాలీ చేపట్టారు. రమేష్ హాస్పిటల్ సిగ్నల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ నినాదాలు చేశారు. పని భారం పెరిగినా స్టైఫండ్ తక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గుంటూరులో జూనియర్ డాక్టర్ల ర్యాలీ


