హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు రాజీ చేయండి'

VZM: సెప్టెంబర్ 12న జరగనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని పెండింగ్‌లో ఉన్న సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత సూచించారు. మంగళవారం జిల్లా కోర్టులో న్యాయవాదులతో సమావేశం అయ్యారు. కక్షిదారులకు లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ చేయాలన్నారు.