హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌గా జయకృష్ణ

TPT: తిరుపతి నగర పాలక సంస్థ నూతన కమిషనర్‌గా ఎం. జయకృష్ణ ఐఏఎస్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావులను మర్యాదపూర్వకంగా కలిశారు. నగర పాలన, అభివృద్ధి అంశాలపై వారితో చర్చించారు.