BPT: కారంచేడు నుంచి చీరాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని చిన్న చప్టాలు బ్రిడ్జి ప్రమాదకరంగా మారిందని వాహనదారులు, స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి రైలింగ్ పూర్తిగా విరిగిపోవడంతో వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ మార్గంలో హెచ్చరికలు లేకపోవడం గమనార్హం.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కారంచేడు—చీరాల రోడ్డుపై ప్రమాదకరంగా చప్టా బ్రిడ్జి


