VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మంగళవారం వేకువజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి బంగారు పుష్పాలతో అష్టదళ పద్మారాధన జరిపి హరతులు సమర్పించారు. శ్రావణ మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవో సుజాత ఏర్పాట్లు పర్య వేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కనకమహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు


