హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దొరవారిసత్రంలో 270 మందికి నోటీసులు

TPT: ఏకొల్లు, దొరవారిసత్రం పరిధిలోని మూడు పోలింగ్‌ కేంద్రాల్లో 270 మంది ఓటర్ల వివరాల్లో తప్పులు గుర్తించారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసి సోమవారం విచారణ చేపట్టారు. సరైన వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలను సేకరించి ఆన్‌లైన్‌లో సవరణలు చేయనున్నట్లు తహసీల్దారు రాజేంద్ర తెలిపారు. అనంతరం తప్పుల్లేని ఓటర్ల జాబితాను రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.