హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామర్లకోటలో త్రాగునీటి వృథా.. పట్టించుకోని అధికారులు

కాకినాడ: సామర్లకోట బ్రౌన్‌పేట అంబేద్కర్ కాలనీలోని జడ్పీ పాఠశాల ఎదురుగా వాటర్ వర్క్స్ పైప్‌లైన్ రిపేర్ కారణంగా త్రాగునీరు వృథాగా పోతోంది. గత నెల రోజులుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు నీరు వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.