హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తిశ్రద్ధలతో మంగళగౌరీ దేవి వ్రతం

అన్నమయ్య: సిద్ధవటం మండలం శ్రీ మంగళగౌరీ సమేత అమరలింగేశ్వర ఆలయంలో శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని మంగళగౌరీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యంగిరి హోమం, పంచామృత అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు చేపట్టారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళగౌరీ వ్రతం ఆచరించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.