కోనసీమ: చేపల వేటకు వెళ్లి 8 మంది జాలర్లు గల్లంతైన ఘటనపై సీఎంవో అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బోటు, జాలర్ల ఆచూకీ దొరికే వరకు కోస్ట్ గార్డు నౌకల సహాయంతో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆందోళనలో ఉన్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా ఈనెల 3న సముద్రంలోకి వెళ్లిన 8 మంది తిరిగి రాలేదు.
ఆంధ్రప్రదేశ్
గాలింపు చర్యలు ముమ్మరం చేయాలి: సీఎం


