MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో సవరించిన ముసాయిదా ఓట్ల జాబితాను పంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామంలోని 14 వార్డులలో ఇటీవల బిఎల్ఓలు సర్ ప్రక్రియను నిర్వహించారు. ప్రక్రియలో పరిశీలనల అనంతరం ముసాయిదా ఓట్ల జాబితాను పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డ్‌లో అంటించారు. ఓటర్ల జాబితాలో పేర్లను సరి చూసుకోవాలని అధికారులు కోరారు.
తెలంగాణ
పంచాయతీలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రదర్శన


