హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలి'

కోనసీమ: కొబ్బరి రైతులు సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కోనసీమ ప్రాంతంలో కొబ్బరి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.