హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం నది బాట.. కొట్టు గ్రామస్థుల అవస్థలు

PPM: కొమరాడ మండలం కొట్టు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది.గ్రామంలోని మోటార్ పనిచేయకపోవడంతో స్థానికులు సుమారు కిలోమీటర్ దూరంలోని నాగావళి నది నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. వర్షాల కారణంగా నది నీరు కలుషితంగా మారడంతో దానిని వినియోగించి అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.