హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన నాయకురాలి చొరవతో తాగునీటి సరఫరా

SKLM: హీరమండలం‌లోని మార్కెట్ వీధిలో గత 4 రోజులుగా తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ పాతపట్నం నియోజకవర్గ నాయకురాలు కొరికాన భవాని స్పందించి, కొరికాన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం వాటర్ ట్యాంకర్‌‌ను ఏర్పాటు చేశారు. దీంతో మార్కెట్ వీధి ప్రజలకు తాగునీరు అందింది. స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.