అన్నమయ్య: మాధవరం-1 గ్రామం మీదుగా వెళ్లే కడప- చెన్నై జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి జాతీయ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి'


