హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి'

AKP: గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని పంచాయతీ కార్యదర్శులను కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం కోటవురట్లలో పారిశుధ్యం-పరిశుభ్రత కార్యక్రమాన్ని పర్యవేక్షించారు . పారిశుద్ధ్య కార్మికులతో వీధులను శుభ్రం చేయించారు. మురికి కాలువలను, మంచినీటి ట్యాంకులను పరిశీలించారు. తాగునీరు కలుషితం కాకుండా చూడాలన్నారు.