హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్యాపిలిలో యాక్సిడెంట్.. యువకుడు మృతి

NDL: ప్యాపిళి మండలం జలదుర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరుణాచల్‌కి సంబంధించిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో రాచర్ల సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్న మనోజ్ (21) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విధులకు బైకుపై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.