హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వడ్డాది శారదా నదిని కాపాడుకుందాం'

AKP: వడ్డాది శారదా నది ఒకప్పుడు మన జీవితంలో భాగంగా ఉండేది. 1980–90ల్లో తాగునీరు, స్నానం, ఆటలు అన్నీ ఈ నదితోనే సాగేవి. తెల్లని ఇసుకతో ఎంతో అందంగా ఉండేది. ప్రస్తుతం ప్లాస్టిక్, చెత్త, వ్యర్థాలతో నది కలుషితమవుతోంది. చికెన్, మటన్, చేపల వ్యర్థాలను నదిలో వేయకుండా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి నదిని కాపాడాలని పంచాయతీ కార్యదర్శిని స్థానికులు కోరుతున్నారు.