ప్రకాశం: మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి వద్ద 45 సంవత్సరాల గుర్తు తెలియని మహిళ శవం లభ్యం అయ్యింది. సుమారుగా మూడు రోజుల క్రితం చనిపోయినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మార్కాపురం జీజీహెచ్‌కి మృతదేహాన్ని తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
రాజంపల్లి వద్ద మహిళ శవం లభ్యం


