హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రైతులను అడ్డుకున్న పోలీసులు

NTR: మైలవరం మండలం చంద్రాల భూ నిర్వాసితులు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 2016లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు ఇప్పటివరకు పరిహారం అందకపోవడంతో వారు పాదయాత్రగా చలో అసెంబ్లీకి బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు వారిని రైతు భరోసా కేంద్రానికి తరలించారు.