హైదరాబాద్: 28°C
తెలంగాణ

వారాంతపు సంత.. సౌకర్యాల్లేక ఇబ్బందులు.!

VKB: దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించే వారాంతపు సంతల్లో సౌకర్యాల్లేక చిరు వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయాలు విక్రయించేందుకు షెడ్డు లేకపోవడంతో రోడ్డుపైనే విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తున్నామని వారు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి సంతల నిర్వహణకు షెడ్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.