హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ మండల కమిటీల నియామకం..!

SDPT: టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆమోదంతో జిల్లాలోని మద్దూరు, దూల్మిట్ట మండల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులను తక్షణమే అమలులోకి వచ్చేలా నియమించినట్లు డీసీసీ అధ్యక్షురాలు తుంకుంట అంక్షారెడ్డి తెలిపారు. మద్దూరుకు మారెళ్ల భాస్కర్ రెడ్డి, దూల్మిట్టకు బండి శ్రీనివాస్‌లను ఎంపిక చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆమె కోరారు.