హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు ప్రచారంపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

MLG: మంత్రి సీతక్క తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్యపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్‌రెడ్డి ములుగు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రికెట్ బెట్టింగ్‌లకు సంబంధించి నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమన్, అభినయచారి, నవీన్ పాల్గొన్నారు.