హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాజమానుల నిర్లక్ష్యం.. రోడ్లపై పశువుల సంచారం

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పశువుల సంచారం సమస్యగా మారింది. కలెక్టర్, ఎస్పీ క్యాంపు కార్యాలయాల సమీపంలోనూ పశువులు రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నా యజమానుల తీరులో మార్పు రావడం లేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశువుల సంచారంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించాలని ప్రజలు కోరారు.