హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీబీనగర్ ఎయిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స

BHNG: బీబీనగర్ ఎయిమ్స్‌లో తొలిసారిగా లాపరోస్కోపిక్ సహాయంతో విప్పుల్స్ ప్యాంక్రియాటోడ్యూడెనెక్టమీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పెరి-అంపుల్లరీ కణితి, కామెర్లతో బాధపడుతున్న రోగికి ఈ సంక్లిష్ట శస్త్రచికిత్స చేశారు. శస్త్రచికిత్స, మత్తుమందు, రేడియాలజీ, రక్తమార్పిడి వైద్యం, పాథాలజీ విభాగాల సమన్వయంతో చికిత్స విజయవంతంగా పూర్తిచేశారు.