హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

ELR: భీమడోలు మండలం కోడూరుపాడుకు చెందిన దొరరాజు, నాగరాజు బైక్ పై తేతలి వెళ్లి వస్తుండగా బాదంపూడి సమీపంలో ప్రమాదం జరిగింది. పెద్దవెలమిల్లి వంతెన వద్ద ఐరన్ పైపులు, రేకుల లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటోలోని రేకులు బైక్ నడుపుతున్న దొరరాజుకు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు.