ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామంలోని టూరింగ్ పేటలో ఇవాళ కోట్లమ్మ వారి వారాల పండుగ ఘనంగా జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉంగుటూరు శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు, సోదరులు పత్సమట్ల భీమరాజు అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని భీమరాజు కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా కోట్లమ్మ వారి వారాల పండుగ


