హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వినాయక చవితి ఉత్సవాలపై సమావేశం

NDL: బనగానపల్లె పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో మంగళవారం వినాయక చవితి ఉత్సవాలపై ఎనకండ్ల గ్రామస్తులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రామానికి చెందిన పెద్దలు యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆమె వారికి సూచించారు.