విశాఖలో పెరుగుతున్న కాలుష్యంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఢిల్లీ(195),హైదరాబాద్(116)కంటే విశాఖలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (205) అధికంగా నమోదవడం ఆందోళనకరమన్నారు. నగరానికి ఐటీ,ఇతర ప్రాజెక్టులు వస్తున్న నేపథ్యంలో కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. పరిశ్రమలు పచ్చదనం పెంచేలా నిబంధనలు అమలుచేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఢిల్లీని దాటిన వైజాగ్ కాలుష్యం.. అసెంబ్లీలో ఎమ్మెల్యే గంటా


