కర్నూలులో రాపిడో, ఓలా వంటి యాప్ ఆధారిత రవాణా సేవలను ఎత్తివేయాలని టీయూసీఐ నగర అధ్యక్షుడు కే. రాజు డిమాండ్ చేశారు. యాప్‌ల వల్ల ఆటో కార్మికుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటోందన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులతో ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆటో కార్మికులకు సంక్షేమ పథకాలు, రుణాలు, బీమా సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాపిడో, ఓలా వంటి యాప్‌లను నియంత్రించాలి'


