హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ

కృష్ణా: బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ గన్నవరం ఇన్‌‌ఛార్జి వల్లభనేని వంశీ మోహన్ మంగళవారం ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పెనమలూరు ఇన్‌‌ఛార్జి దేవభక్తుని చక్రవర్తి, పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం జగన్ తాడేపల్లికి బయలుదేరారు.